
జగ్గయ్యపేట, ఎన్‌టిఆర్ జిల్లా — డిసెంబర్ 4, 2025 (CITY NEW STELUGU)
విజయవాడ నుంచి కంచికచర్ల వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన బంగారపు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో వేగంగా ఛేదించారు. శొంఠి అమలేశ్వరి ప్రయాణిస్తున్న బస్సులో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు ఫిర్యాదు రావడంతో జగ్గయ్యపేట పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బస్సు ఆగిన ప్రతి స్టాప్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను జాగ్రత్తగా పరిశీలించిన బృందం, కంచికచర్ల బస్‌స్టాండ్ ఇన్‌గేట్ వద్ద ఒక మహిళ బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకుని పిల్లవాడితో కలిసి బస్సు నుంచి దిగుతున్న దృశ్యాలను గుర్తించింది.Jaggayyapet lo 15: జగ్గయ్యపేటలో 15 కోట్లతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
లోకల్ పోలీసుల సహాయంతో నిందితురాలు పాలపర్తి విశాలాక్షి (22), ఎస్.అమరవరం గ్రామం, కంచికచర్ల మండలానికి చెందినది, అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి సుమారు 7 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేశారు. బస్సు రద్దీగా ఉండటం, బాధితురాలు నిద్రపోవడాన్ని అవకాశంగా తీసుకుని బ్యాగ్‌ను దొంగిలించినట్లు నిందితురాలు విచారణలో ఒప్పుకుంది.

ఈ కేసు వివరాలను జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ప్రెస్ మీట్‌లో రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ, నందిగామ సబ్‌డివిజన్ ఎసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు, చిల్లకల్లు ఎస్ఐలు టి. సూర్య శ్రీనివాస్, ఎస్.ఎన్.ఎస్. మణికంఠతో పాటు దర్యాప్తు సిబ్బంది పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 వేల సీసీ కెమెరాల సురక్షా 360 నెట్వర్క్ వల్లే నిందితురాలిని త్వరగా గుర్తించి అరెస్ట్ చేయగలిగినట్లు ప్రెస్ మీట్‌లో పేర్కొన్నారు.








