chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :గుంటూరు నగర అభివృద్ధి పై అంబటి రాంబాబు & కో దుష్ప్రచారం మానాలి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: – నగర అభివృద్ధిపై అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితర వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. గుంటూరు నగరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబి) అంశంపై ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద ఇటీవల వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే ప్రయత్నం చేశారని అన్నారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి ఏమి జరిగిందో ప్రజలు చూశారని, అందుకే ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలోనే అభివృద్ధిలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ, గుంటూరు నగర ఎమ్మెల్యేలను డమ్మీలు అన్న విమర్శలకు వాస్తవాలే సమాధానమని చెప్పారు. “మా అభివృద్ధి మీ గుండెల్లో డైనమైట్‌లా, ప్రజల గుండెల్లో డైమండ్‌లా నిలిచింది” అని వ్యాఖ్యానించారు. మొదటిసారి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌గా 18 నెలల్లో చేసిన అభివృద్ధిని, వైసీపీ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులతో పోల్చి చెప్పాలని సవాల్ చేశారు.

ఆర్‌ఓబి అంశంపై మాట్లాడుతూ, ఇది ఫ్లైఓవర్ కాదని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్, ఆర్‌ఓబి మధ్య తేడా తెలియకుండా విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంపై హేళనగా మాట్లాడటం అవగాహన లోపమేనని వ్యాఖ్యానించారు.Guntur Local News

డ్రెయిన్లు, రోడ్ల విస్తరణ వంటి పనులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నామని, ప్రతి నిర్ణయానికి ముందు అధికారులతో సమీక్షలు, ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. కేంద్రమంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి వారం గుంటూరులో ఉండి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి సమయంలో కొంత అసౌకర్యం తప్పదని, పెద్ద ప్రయోజనం కోసం ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker