ఆంధ్రప్రదేశ్గుంటూరు
BREAKING NEWS – GUNTUR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కారం
MLC ELECTION UPDATE
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం అభ్యర్డుల సమక్షంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు వి. కరుణ , రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ చేపట్టడం జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనలో 30 మంది అభ్యర్డుల నామినేషన్లను అంగీకరించడం జరిగింది. అదేవిధంగా పది మంది అభ్యర్డుల నామినేషన్లను తిరస్కరించారు. జరిగింది. నామినేషన్ల పరిశీలనా కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డిఆర్ఓ షేక్. ఖాజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, కలక్టరేట్ ఎన్నికల విభాగ సిబ్బంది , అభ్యర్డులు పాల్గొన్నారు.