ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఆలపాటి గెలుపు కోసం నాయకులు కృషి చేయాలి
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ఫిరంగిపురం మండలంలోని కూటమి నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రవి అన్నారు. మంగళవారం ఫిరంగిపురంలోని టీడీపీ కార్యాలయంలో మండలంలోని నాయకులతో సమావేశం నిర్వహించారు. రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓటర్లకు తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు, తెలుగుదేశం నాయకులు పసల థామస్, యనమాల ప్రకాష్, అప్పారావు, బాల జోజి, హృదయ రాజు, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.