
గుడివాడ:ఏ.ఎన్.ఆర్. కాలేజ్లో గణితశాస్త్ర ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గణితశాస్త్ర అధ్యాపకురాలు కె.యు.ఎస్. శైలజ మాట్లాడుతూ, గణితశాస్త్రం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మన దైనందిన జీవితంలోని ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కాలాన్ని గణించడం, లావాదేవీలు నిర్వహించడం, వ్యాపార లాభనష్టాల అంచనా, వంటలు, ప్రయాణాలు, నిర్మాణాలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య రంగం, అంతరిక్ష పరిశోధనలు వంటి అనేక రంగాల్లో గణితశాస్త్రం పునాదిగా నిలుస్తోందని వివరించారు. ANR College Gudivada Diamond Jubilee Celebrations: An Incredible 60 Years of Educational Excellence and Farmer Welfare – ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడ వజ్రోత్సవ వేడుకలు: 60 ఏళ్ళ అద్భుత విద్యా నైపుణ్యం, రైతు సంక్షేమం
గణితశాస్త్ర విభాగాధిపతి కె. రమాదేవి మాట్లాడుతూ, విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం, క్రమబద్ధమైన ఆలోచనలను పెంపొందించడంలో గణితశాస్త్రం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. గణితంపై పట్టు సాధించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గణితశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మరింత లోతుగా అవగాహన చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటగా నిలుస్తాయని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.ఎస్.ఎస్. పద్మజ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ ఎల్.ఆర్.కె. ప్రసాద్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె.ఎస్. అప్పారావు, గణితశాస్త్ర విభాగాధిపతి కె. రమాదేవి, అధ్యాపకురాలు పి. భారతి, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.








