Guntur News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జీలు
AWARENESS PROGRAMME IN GGH
జ్యుడీషియల్ అకాడమిలో ట్రైనింగ్ పొందుతున్న 60 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జీల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు, వివిధ రకములైన కేసులకు సంబంధించి శిక్షణ నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. వారికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని వైద్యులు అనేక విధములైన శిక్షణ ఇవ్వడం జరిగింది. మొదటగా ట్రామా మరియు ఎమర్జెన్సీ విభాగం నందు ఆక్సిడెంట్ మరియు ట్రామాకి సంబంధించిన కేసులు పైన అవగాహన కొరకు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం నందు వచ్చే కేసులు వాటి పూర్వాపరాలను ట్రైనీ జడ్జిలకు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాధికా రాణి వివరించారు. తదుపరి ఆర్థో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య ఆక్సిడెంట్ కి మరియు ఎముకలకు సంబంధించి ఆసుపత్రికి వచ్చే వివిధ రకములైన కేసులకు సంబంధించిన వివరాలను ట్రైనీ జడ్జీలకు వివరించారు. అనంతరం మెడికల్ రికార్డు ఆఫీసర్(MRO) రామారావు MLC, నాన్ MLC కేసులకు సంబంధించి రికార్డులు భద్రపరిచే విధానాలను ట్రైనీలకు తెలియజేసారు. తదుపరి ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ జాఫర్ పోస్ట్ మార్టం చేసే ప్రక్రియలను దానికి సంబంధించిన న్యాయ పరమైన అంశాలను ట్రైనీ జడ్జి లకు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ SSV రమణ, ఆక్సిడెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఆర్తో, ఫోరెన్సిక్ విభాగ వైద్యులు, జ్యుడీషియల్ అకాడమి సభ్యులు పాల్గొన్నారు.