
మంగళగిరి: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం (బోగి ఎస్టేట్స్)లో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డితో కలిసి బోగి ఎస్టేట్స్‌కు చేరుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మైదానంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి, కొద్దిసేపు స్వయంగా క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.Managalagiri lo waakres:మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తదనంతరం మ్యాచ్‌ను తిలకిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు.

ఈ సందర్భంగా టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును జ్ఞాపికతో సత్కరించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయవచ్చని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.










