chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :ప్రగతినగర్ చెరువు లో చెత్త వేయ‌కుండా హైడ్రా ఫెన్సింగ్‌

కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11:- ప్రగతినగర్ చెరువు పరిరక్షణకు హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చెరువులో చెత్త, జంతు వ్యర్థాలు వేయడం వల్ల నెలకొన్న దుర్వాసన సమస్యపై స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

Hyderabad Local News :ప్రగతినగర్ చెరువు లో చెత్త వేయ‌కుండా హైడ్రా ఫెన్సింగ్‌

ఇటీవల చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించిన హైడ్రా అధికారులు, ఇప్పుడు చెత్త డంపింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు రోడ్డు పొడవునా భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో ఉన్న రహదారి మార్గం వెంబడి చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు సమీప దుకాణదారులు వ్యర్థాలను చెరువులో పడేస్తున్నారని గుర్తించారు.

దీంతో 145 లారీల వరకు పేరుకుపోయిన జంతు వ్యర్థాలు, చెత్తను అధికారులు తొలగించారు. వ్యర్థాలు వేస్తున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి అక్కడికి మార్పించారు. ఇకపై చెరువులో చెత్త వేయడానికి అవకాశం లేకుండా దాదాపు కిలోమీటరు అర మేర 10 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.Hyderabad- Amaravathi

అదేవిధంగా చెరువులోకి మురుగు నీరు కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. త్వరలోనే చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రగతినగర్ చెరువును సుందరీకరించనున్నట్లు వెల్లడించారు.

స్థానికులు హైడ్రా చర్యలను స్వాగతిస్తూ, చెరువు పరిరక్షణలో ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker