
విశాఖపట్నం, ఫిబ్రవరి 19:– అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (International Fleet Review) మరియు వ్యాయామం MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer పాల్గొని ప్రసంగించారు. బంగాళాఖాతాన్ని నేపథ్యంగా చేసుకుని లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగిన ఈ వేడుక విశాఖ నగరానికి అపూర్వ గౌరవాన్ని తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నం కేవలం ఆతిథ నగరం మాత్రమే కాదు, తూర్పు తీరానికి సముద్ర హృదయం అని గవర్నర్ అభివర్ణించారు. తరతరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సముద్రాన్ని అవకాశాల ద్వారంగా, ప్రపంచంతో అనుసంధానంగా చూసారని తెలిపారు. ఈ సందర్భంలో ప్రపంచ దేశాల స్నేహపూర్వక నౌకలు, భారత నౌకాదళ యుద్ధ నౌకలు కలిసి బంగాళాఖాతంలో నిలవడం అంతర్జాతీయ సముద్ర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

గత కొన్ని రోజులుగా విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షతో పాటు MILAN వ్యాయామం విజయవంతంగా నిర్వహించబడిందని, నిన్న భారత రాష్ట్రపతి సమీక్షించిన ఫ్లీట్ రివ్యూ సముద్రంపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిందని గవర్నర్ గుర్తుచేశారు. ఈరోజు సిటీ పరేడ్ ద్వారా ఆ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజలతో పంచుకునే ఉత్సవంగా మారిందన్నారు.

భారత సైన్యాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ దళాల మార్చింగ్ కంటింజెంట్లు, సైనిక బ్యాండ్లు క్రమశిక్షణతో సాగిన పరేడ్ దేశ సైన్యాల ఐక్యతను ప్రతిబింబించిందన్నారు. విదేశీ దేశాల దళాలు, విమానాలు భారత భూమిపై అడుగుపెట్టడం స్నేహం, విశ్వాసం, పరస్పర గౌరవానికి నిదర్శపైన నిదర్శనమని చెప్పారు.

ఎన్సీసీ, సీ కేడెట్ కార్ప్స్, పాఠశాల విద్యార్థుల పాల్గొనడం తనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని గవర్నర్ తెలిపారు. యూనిఫామ్‌లో కనిపించిన యువతలో క్రమశిక్షణ, లక్ష్యసాధన, ఆత్మవిశ్వాసం కనిపించిందని, వారు దేశ భవిష్యత్తు ప్రతినిధులని అభిప్రాయపడ్డారు.

సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, భారత సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన టాబ్లోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైనిక శక్తి మరియు సాంస్కృతిక సంపద కలయికే భారత బలం అని గవర్నర్ పేర్కొన్నారు.
రాత్రి వేళ సముద్రంలో నిలిచిన నౌకల దీపాలంకరణ, ఆకాశాన్ని కాంతుల వలయంగా మార్చిన బాణాసంచా, లేజర్ మరియు డ్రోన్ ప్రదర్శనలు విశాఖ ఆకాశాన్ని ప్రకాశింపజేశాయి. ఆధునిక భారత సృజనాత్మకతకు ఇవి ప్రతీకలని ఆయన చెప్పారు.

విశాఖలో ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు గాఢమైన అనుబంధం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. విదేశీ నౌకల రాకతో విశాఖ అంతర్జాతీయ సముద్ర నగరంగా మరింత గుర్తింపు పొందుతుందని, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం అవుతాయని తెలిపారు.visakhapatanam Local News :ఆడిట్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి-(PUC) చైర్మన్ కూన రవికుమార్
ప్రపంచం పరస్పర అనుసంధానమవుతున్న ఈ కాలంలో సముద్రాలు దేశాలను కలుపుతున్నాయని, సముద్ర సహకారం శాంతి, సమృద్ధికి పునాది అవుతుందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ముగించారు.







