బాపట్ల జిల్లా: రక్షణ సైన్యం కొత్త నాయకుల ప్రతిష్ట||Bapatla District: Rakshana Sainyam New Leaders Felicitation
రక్షణ సైన్యం కొత్త నాయకుల ప్రతిష్ట
ఘనంగా నిర్వహించిన రక్షణ సైన్యం నూతన రాష్ట్రీయ నాయకుల ప్రతిష్ట కార్యక్రమం
బాపట్ల రక్షణ సైన్యం సెంట్రల్ కోర్‌లో శనివారం నాడు రక్షణ సైన్యం నూతన రాష్ట్రీయ నాయకుల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రక్షణ సైన్యంలో కొత్తగా రాష్ట్రీయ నాయకులుగా నియమితులైన కమిషనర్ దాసరి డానియల్ రాజు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కమిషనర్ లాల్కియాంలోవ మరియు లేహలింపుయ్ దంపతులు హాజరై కొత్త నాయకులకు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఇండియన్ సెంట్రల్ పరిధిలోని వివిధ డివిజన్ల నుండి అనేక మంది మండల నాయకులు, సేవకులు, రక్షణ సైన్యం వీరులు, యువకులు, మహిళలకూటం పాల్గొని కొత్త నాయకులను అభినందించారు.
ఈ సభలో ప్రత్యేకంగా బాపట్ల మండల నాయకులు మేజర్ పి.ఏసు పాదం పర్యవేక్షణలో స్థానిక డివిజన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బి.ఎ బెనర్జీ మేనన్, దాసరి శ్యామ్ లివింగ్‌స్టన్, కాగిత వరప్రసాద్, గేరా మణిభూషణ్, దాసరి శ్యామ్ బాబు, ఆర్య కొర్నేలు తదితరులు పూర్ణ సహకారం అందించారు.
ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా, ప్రతిష్టాత్మకంగా జరగడంతో స్థానికంగా విశేషంగా చర్చకు దారి తీసింది. రక్షణ సైన్యం తమ సామాజిక సేవా కార్యకలాపాల ద్వారా దేశానికి శాంతి, సురక్షలను అందించడానికి కొత్త నాయకులతో మరింత ముందుకు వెళ్తుందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని స్థానిక నాయకులు సన్మానించి రక్షణ సైన్యం లక్ష్యాలను వివరించారు. నూతన నాయకుల నియామకం ద్వారా రక్షణ సైన్యం మరింత విస్తరించి సమాజానికి మంచి చేయాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు.