GUNTUR NEWS: ఉత్సాహంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్
MLC ELECTION UPDATE
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టుబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టిడిపి, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ర్యాలీకి తరలివచ్చి ఆలపాటికి మద్దతు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి ఎంతో మంచి పేరు పొందారని చెప్పారు. గత ఎన్నికల్లో తెనాలి సీటును సైతం త్యాగం చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత మళ్ళీ పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారుహ ఆలపాటి గెలుపు కోసం సమిష్టిగా పనిచేస్తామని వారు వెల్లడించారు.