
ఎన్నికల్లో YSRCP ఓడిపోయాకే మాజీ సీఎం YS Jagan ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉనికి కోసం బలప్రదర్శనలు చేస్తున్నారని.. జనం మరిచిపోతారనే ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో మీడియాతో షర్మిల మాట్లాడారు.
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. జగన్ దీన్ని గమనించకపోవడం బాధాకరం. ఈ ఘటనను ఫేక్ అనడం తప్పు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ప్రజలను చంపుతున్నా జగన్ పర్యటనలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? అసెంబ్లీ వేదికగా ఆయన పోరాటాలు చేయాలి.
అక్కడికి వెళ్లే దమ్ములేకే బయట మాట్లాడుతున్నారు” అని షర్మిల విమర్శించారు.







