
Bapatla;07-11-25;-జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా వైద్య నిపుణులు ప్రజలకు సందేశమిస్తూ — క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స పూర్తిగా సాధ్యమని వెల్లడించారు. ఆరోగ్యపరమైన చిన్నచిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
క్యాన్సర్‌పై సమయానికి అవగాహన కలిగితే ప్రాణాలను రక్షించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. సులభంగా గుర్తించగల లక్షణాలను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.క్యాన్సర్ బాధితులకు సమాజం తోడుగా నిలవాలని, వారికి ధైర్యం, మద్దతు అందించాలనే పిలుపునిచ్చారు.







