chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Amaravathi news:సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికిఎంపికైన విద్యార్ధిని విద్యార్ధులను అభినందించిన-మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి

అమరావతి, నవంబర్ 5:-సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంపు లక్ష్యంగా ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న “సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ టు న్యూఢిల్లీ” కార్యక్రమానికి ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నేడు విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.ఈ సందర్భంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను అభినందించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపుతో పాటు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి కల్పించడమే ఈ టూర్ ఉద్దేశమని మంత్రి తెలిపారు.

Amaravathi news:సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికిఎంపికైన విద్యార్ధిని విద్యార్ధులను అభినందించిన-మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ టూర్‌లో పాల్గొంటున్నారు. నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ వంటి ప్రముఖ సైన్స్ కేంద్రాలను విద్యార్థులు సందర్శించనున్నారు.మొదటిసారిగా విమానంలో ప్రయాణించే అవకాశం రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని తమ జీవితంలో మరువలేని అనుభూతిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి అరుదైన అవకాశాలు కల్పించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

Amaravathi news:సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికిఎంపికైన విద్యార్ధిని విద్యార్ధులను అభినందించిన-మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి

మంత్రి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరవడం గర్వకారణం. ఈ టూర్ మీలోని సృజనాత్మకతను వెలికితీసే వేదిక అవుతుంది” అన్నారు.

Amaravathi news:సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికిఎంపికైన విద్యార్ధిని విద్యార్ధులను అభినందించిన-మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి

ఈ కార్యక్రమంలో I&I శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్షా SPD శ్రీనివాస్, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker