
:– వైద్య నిపుణులు: “నెలలు తక్కువగా పుట్టినా చికిత్స సరైన సమయం లో లభిస్తే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు”
గుంటూరు, నవంబర్ 17:వరల్డ్ ప్రీమేచ్యూరిటీ డేని పురస్కరించుకొని గుంటూరులోని అస్టర్ రమేష్ హాస్పిటల్ లో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. నెలలు తక్కువగా పుట్టే శిశువులకు ఆధునిక వైద్యం, సమయానికి చికిత్స, ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణ ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు వివరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పలు విభాగాల వైద్య నిపుణులు ప్రీ-టర్మ్ శిశువుల సమస్యలు, చికిత్స విధానాలు, విజయవంతమైన NICU సంరక్షణ, భవిష్యత్ జాగ్రత్తలపై కీలక సూచనలు ఇచ్చారు.
డాక్టర్ రాయపాటి మమత (డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్) మాట్లాడుతూ… Guntur Aster Ramesh Achieves Rare Success in High-Risk Pregnancy Case: ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో 700 గ్రాముల ప్రీమెచ్యూర్ శిశువు చికిత్సలో అరుదైన విజయం
“ప్రీమేచ్యూర్ బేబీస్ అంటే 9 నెలల ముందు పుట్టిన శిశువులు. వీరి ఊపిరితిత్తులు, గుండె, మెదడు మరియు శరీర అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ప్రాణహాని ప్రమాదం అధికంగా ఉంటుంది. కానీ అప్పటికప్పుడు NICUలో అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటరింగ్ వ్యవస్థలు, ప్రత్యేక నర్సింగ్ సపోర్ట్ ఉంటే ప్రాణాలను రక్షించడం మాత్రమే కాదు—శిశువును పూర్తిగా ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్ద వచ్చు. అస్టర్ రమేష్ హాస్పిటల్‌లో ఈ సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
డాక్టర్ అనిత చాగంటి (సీనియర్ నియోనేటాలజిస్ట్) మాట్లాడుతూ…
“24–30 వారాల్లో పుట్టే శిశువులలో రెస్పిరేటరీ డిస్ట్రెస్, బ్రాంకో పల్మనరీ డిస్ప్లేసియా, బరువు సమస్యలు, థర్మల్ ఇన్‌స్టబిలిటీ ఉంటాయి. NICU బెడ్, ప్రత్యేక వెంటిలేషన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ — ఇవి సమయానుకూలంగా అందితే శిశువు బతుకే అవకాశాలు మరింత పెరుగుతాయి. గత కొద్ది నెలల్లో రమేష్ హాస్పిటల్‌లో పలు అత్యంత హై రిస్క్ కేసులు విజయవంతంగా చికిత్స చేయడం మా బృందం సమిష్టి కృషే” అని చెప్పారు. Gas, Fatty Liver, Fibroscan, Colonoscopy — ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!“గ్యాస్‌నే తక్కువగా తీసుకున్నాం… కానీ లివర్, కిడ్నీ & కోలన్ కేన్సర్ నిజాలు ఎవరూ చెప్పలేదు! | Dr Chaitanya Gastro Interview ”Aster Ramesh Guntur
డాక్టర్ మహేష్ చౌదరి అతోట (నియోనేటాలజీ స్పెషలిస్ట్) తెలిపారు…
“700 గ్రాముల బరువుతో పుట్టిన శిశువులు అత్యంత క్రిటికల్ స్థితిలో ఉంటారు. వీరికి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, ఆక్సిజన్ స్థాయి, ఇన్ఫెక్షన్ రక్షణ ప్రతి క్షణం అవసరం. NICU టీమ్ నిరంతర పర్యవేక్షణ, ప్రోటోకాల్ ప్రాతిపదికన చికిత్స వల్లే ఇవాళ ఇలాంటి బిడ్డలు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారు. ఇది ఆధునిక వైద్యం ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందో స్పష్టమైన ఉదాహరణ” అని అన్నారు. Doctor: పుట్టిన బిడ్డల ఆరోగ్యం & సంరక్షణ — తల్లిదండ్రులకు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి మార్గదర్శకం: Newborn Care Explained by Specialist –K.RAMBABU Journlist Exclusive Health Talk” -Dr. Mahesh Choudary Athota Consultant,Paediatric & Neonatology,MBBS, MD, Fellowship in Neonatology :
డాక్టర్ జ్యోతి ప్రకాశ్ రెడ్డి (పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్) వివరించారు…
“ప్రీమేచ్యూర్ బేబీస్‌లో PDA—అంటే గుండెలో రంధ్రం మూసుకోవడం ఆలస్యమవడం—అత్యంత సాధారణ సమస్య. ఇది హార్ట్‌పై అదనపు ఒత్తిడి పెంచుతుంది. సమయానికి గుర్తించి, సరైన పీడియాట్రిక్ కార్డియాలజీ ఇంటర్వెన్షన్ ఇచ్చితే శిశువు త్వరగా కోలుకుంటాడు. రమేష్ హాస్పిటల్‌లో ఇందుకు ప్రత్యేక కార్డియాక్ టీమ్ అందుబాటులో ఉంది” అన్నారు.
డాక్టర్ అపూర్వ & డాక్టర్ తన్వీర్ బేగం (పెడియాట్రిషియన్లు) మాట్లాడుతూ…
“NICU నుంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు ఫాలోఅప్ చాలా ముఖ్యమైన దశ. బరువు పెరుగుదల, ఇన్ఫెక్షన్ రిస్క్, అవయవాల అభివృద్ధిపై నిరంతర పరీక్షలు అవసరం. అనేక కుటుంబాలు ఈ ఫాలోఅప్‌ను లైట్‌గా తీసుకుంటారు — ఇది తప్పు. క్రమం తప్పకుండా సమగ్ర పరీక్షలు చేయించాలి” అని సూచించారు.
డాక్టర్ అనురాధ (హై రిస్క్ గైనకాలజీ) తెలిపారు…
“ప్రీ టర్మ్ డెలివరీ రావడానికి కారణాలు — రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ప్లాసెంటా సమస్యలు, హై బిపి, ఒత్తిడి ఇలా ఎన్నో. గర్భిణి క్రమంగా చెక్‌అప్ చేయించుకుంటే ఈ సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు” అని చెప్పారు.
డాక్టర్ వసంత & డాక్టర్ భాను తేజా (OBG టీమ్) అభిప్రాయాలు…
“హై రిస్క్ గర్భధారణలో తల్లిని కాపాడటం, శిశువు ఆరోగ్యాన్ని నిలబెట్టడం రెండు సమానంగా కీలకమైన పనులు. బర్త్ అండ్ బియాండ్ యూనిట్‌లో 24 గంటలు వైద్యుల సమన్వయం ఈ విజయాలకు ప్రధాన కారణం” అని తెలిపారు.
వైద్యుల సమిష్టి అభిప్రాయం:“ముందస్తు జననం తప్పదు — కానీ ముందస్తు చికిత్స తప్పనిసరి”
ఎందుకు వరల్డ్ ప్రీ మేచ్యూరిటీ డే జరుపుతారు?నెలలు తక్కువగా పుట్టే శిశువుల సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికిహై-రిస్క్ గర్భిణిలకు సరైన మార్గదర్శకం అందించడానికిప్రీమేచ్యూర్ బేబీస్ కూడా పూర్తి ఆరోగ్యంతో పెరుగుతారని తెలియజేయడానికి
అస్టర్ రమేష్ హాస్పిటల్ సందేశం:ఆధునిక పరికరాలు + ప్రత్యేక శిశు వైద్యులు + నిరంతర నర్సింగ్ కేర్ = ప్రీమేచ్యూర్ శిశువులకు శాతం ఎక్కువైన జీవనావకాశం. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన NICU సదుపాయాలు గుంటూరులోని అస్టర్ రమేష్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయి”








