

ప్రతి సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డిసెంబర్ 1న సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ గారు ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను తెలిపేందుకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాదలచినవారు ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు







