

బాపట్ల పట్టణ సిఐ. రాంబాబు మరియు బాపట్ల శక్తి సబ్ డివిజన్ టీం, శక్తి యాప్ అవగాహన కార్యక్రమం ను
బుధవారం బాపట్ల పట్టణం శ్రీ సరస్వతి గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహించినారు. ఈ సందర్బంగా బాపట్ల పట్టణ సిఐ రాంబాబు
విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు క్రమశిక్షణ సమాజం పట్ల ఏ విధంగా అప్రమత్తంగా మెలగాలి అనే అంశాల పట్ల, విద్యార్థులకు భవిష్యత్తు పట్ల మోటివేషన్ ఇచ్చి, సమాజ శ్రేయస్సు కు విద్యార్థి దశలో ఏ విధంగా మెలగాలి విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరాలంటే ఏ విధమైన విద్య నభ్యసించాలి, అభివృద్ధి చెందాలి, అనే అంశాలు మరియు డ్రగ్స్ వాడటం ఏ విధంగా ఆరోగ్యానికి,సమాజానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మొదలగు అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.







