
ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా రూ.2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం.. అబద్ధం, మోసం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.







