
9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.’అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్ఆ పై రోపణలు చేస్తున్నారు. హామీల అమలులో 40 ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని అంబటి రాంబాబు మండిపడ్డారు.







