chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)

సీఎం చంద్రబాబుకు నెల్లూరులో ఘన స్వాగతం

వెంకటాచలం (నెల్లూరు జిల్లా), అక్టోబర్ 10:జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.14 గంటలకు సీఎం నందగోకులం హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయనను ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబుకు నెల్లూరులో ఘన స్వాగతం

ఈ సందర్భంగా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడు కీలక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇవి – నందగోకులం లైఫ్ స్కూల్, నంది పవర్ బుల్ ప్రాజెక్టు, విశ్వసముద్ర బయో ఎనర్జీ ఈథనాల్ ప్రాజెక్టు.

సీఎం పర్యటనలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, ప్రాంత శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, దగుమాటి కృష్ణారెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

విజయవాడకు సీఎం తిరుగు ప్రయాణం

ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం 4.53 గంటలకు సీఎం చంద్రబాబు నందగోకులం హెలీప్యాడ్‌ చేరుకొని అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడకు బయలుదేరారు. సీఎం పర్యటన ముగింపు సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker