ఏలూరు నగరంలోని మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. మున్సిపాలిటీ లో పనిచేస్తున్న వర్కర్ల అందరికీ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి 26,000 నుంచి 29 వేల వరకు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం త్వరలో తీసుకోవాలన్నారు. మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిశీలించిన పక్షంలో ఈనెల 15వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్ శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాస్ డాంగే, పి కిషోర్, బండి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.
228 Less than a minute