కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం మండల పరిధిలోని నందిగామ పంచాయతీ పరిధిలోని పరకోడు నుండి భూదేవి కోడ్ దావోజీపాలెం వరకు గల 2 కిలోమీటర్ల పొడువు ఉన్న మురుగు కాలవలో కిక్కిస, జమ్ము, గుర్రపు డెక్కతో పూడుకుపోయి అకాల వర్షాలు, వరదల కారణంగా మురుగు కాలువ నిండిపోయి కాలవకు ఇరువైపుల ఉన్న సుమారు 1000 ఎకరాల పంట నీటమునిగి రైతన్నకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు నందిగామ గ్రామ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మి నాగేశ్వరావు ఆయన సొంత ఖర్చులతో మురుగు కాలవ పూడికతీత పనులను బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పెడన జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, టీడీపీ పెడన మండల అధ్యక్షులు శలపాటి వీర ప్రసాద్, టీడీపీ పెడన మండల ప్రధాన కార్యదర్శి శీరం ప్రసాద్, గ్రామపార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
230 Less than a minute







