
మంగళగిరి, నవంబర్ 1:-మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీక చిలుక ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం స్వామివారి బంగారు గరుడ వాహనంపై గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.శ్రీదేవి, భూదేవి సమేతుడైన నృసింహస్వామిని బంగారు గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి రంగురంగు పూలమాలలతో అలంకరించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన భాగ్యం పొందారు. గ్రామోత్సవం దేవస్థానం నుండి ప్రారంభమై మెయిన్ బజార్, మిద్దే సెంటర్ మీదుగా తిరిగి పెదకోనేరు దారి ద్వారా దేవస్థానానికి చేరుకుంది. మార్గమధ్యంలో పురవీధుల్లో భక్తులు స్వామివారిని దర్శించుకొని టెంకాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించారు.గ్రామోత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఏసి అండ్ ఈవో కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు.







