
బాపట్ల: నవంబర్ 10:-జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీదారుల ఫిర్యాదులు, సమస్యలను స్వయంగా స్వీకరించారు.
వివిధ మండలాల నుంచి ప్రజలు తమ అర్జీలతో కలెక్టరేట్‌కు తరలివచ్చి సమస్యలను వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీవో పి. గ్లోరియా కూడా ప్రజల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డిఆర్డిఏ పీడీ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డి.ఈ.ఓ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రాఘునాథ్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







