
గుంటూరు, ఫిబ్రవరి 19:- గుంటూరు నగరంలోని ఆటోనగర్‌లో ఉన్న జయలక్ష్మి నెక్సా షోరూం లో Maruti Suzuki సంస్థకు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ e విటారా కారును గురువారం సాయంత్రం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోందన్నారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవడం వల్లే ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ దక్కుతోందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 540 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని, పెట్రోలు ఖర్చుతో పాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయని వివరించారు.

షోరూం సీఈవో మారుతి కుమార్ మాట్లాడుతూ, e విటారా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం స్టాక్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. రూ.21,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకుంటే 30 రోజుల్లో డెలివరీ ఇస్తామని వెల్లడించారు. వినియోగదారులకు టెస్ట్ డ్రైవ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్ ప్రారంభ ధర రూ.10 లక్షల 99 వేలుగా నిర్ణయించబడిందని వివరించారు.Guntur Local News
e విటారా ఎలక్ట్రిక్ కార్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9573945678 నంబర్‌ను సంప్రదించవచ్చని షోరూం యాజమాన్యం తెలిపింది.
ఈ కార్యక్రమంలో షోరూం జీఎం భవాని శంకర్, మేనేజర్ భరత్, సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







