
స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్పెంటర్ల(మెషిన్ పై చెక్క పని చేసేవారు)కి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (జెడ్)పై జిల్లా పరిశ్రమల కేంద్రంలో అవగాహన సదస్సు జరుగుతుందని, నగరంలోని కార్పెంటర్లు వర్క్ షాప్ కి హాజరవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత నెల 28 నిర్వహించాల్సిన వర్క్ షాప్ తుఫాన్ వలన వాయిదా వేయడం జరిగిందని, సదరు వర్క్ షాప్ ఈ నెల 5వ తేదీన జరుగుతుందన్నారు. వర్క్ షాప్ లో జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (జెడ్) సర్టిఫికేషన్ పధకం, ఎంఎస్ఎంఈలకు లభించే ప్రయోజనాలు, జెడ్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్ కు దశల వారీ మార్గదర్శకాలు, వ్యాపార వృద్ధి, ప్రపంచ గుర్తింపు అంశాలపై స్కిల్ ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో ఆయా రంగాల నిపుణులు అవగాహన కల్గిస్తారని పేర్కొన్నారు. కనుక నగరంలోని కార్పెంటర్లు అవగాహన సదస్సుకు హాజరై జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (జెడ్) గూర్చి తెలుసుకొని తమ నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవాలని కోరారు.
 
 






