
అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు కోరారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూమి సాగు చేస్తున్న వారిలో నూటికి 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెడుతూ కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







