
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా వారం రోజులు పాటు పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ ముగింపు వేడుకలు బృందావన్ గార్డెన్స్ మహిళా, బాల గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత సుజాత, యోగా గురువులు రెడ్డి సాంబశివరావు, మోహన్ రెడ్డి, రామారావు, గ్రంథాలయ అధికారి శకుంతల తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని సూచించారు. లుక్ కల్చర్ మాని బుక్ కల్చర్ వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు.







