
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం గుంటూరులో పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు గాను జిల్లాలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. పంట నష్టం గురించి కలెక్టరేట్లో ఇవాళ రివ్యూ చేసాము. టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతున్నాయి? కాంపన్సేషన్ ఇస్తున్నారు అనే అంశాలపై హార్టికల్చర్, అగ్రికల్చర్, సీసీఐ కాటన్ శాఖాధికారులతో రివ్యూ చేసాం. హార్టికల్చర్ తీసుకుంటే నష్టపోయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరీకల్చర్ వీటిల్లో వాళ్లకి టోటల్ కాస్ట్ కల్టివేషన్‌కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంత పే చేస్తూన్నాము. ఇప్పుడు సపోజ్ అరటి పంటకు ₹35,000 ఒక హెక్టార్ కు పే చేస్తున్నాం. టర్మరిక్‌కు ₹35,000 ఒక్కో హెక్టార్ కు. చెల్లిస్తున్నాము. ఈ క్రాప్ లాస్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా 60:40 కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు పసుపు తీసుకుంటే ₹50,000 అడిషనల్‌గా వచ్చే అవకాశం ఉంది. అంటే ₹35,000 మనం లాస్, అలాగే ₹50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే ₹85,000 ఒక్కో హెక్టార్‌కి పసుపు రైతుకు, ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా లాప్సెస్ లేకుండా, వీటిని సిస్టమాటిక్‌గా అప్‌లోడ్ చేసి ప్రాపర్ అసెస్‌మెంట్ చేయిస్తున్నాం. ఇప్పుడు హార్టికల్చర్ కు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్స్ 100 గ్రామాల్లో ప్రాపర్ సర్వే చేసి అందిస్తారు. అగ్రికల్చర్ లో ఇక్కడ వరి ఇప్పటి వరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్ మెర్జ్ అయిపోయింది. ఇవి కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్, ఇప్పుడు ఎంఎస్పీ ప్రైజ్ వచ్చేటప్పటికి ₹8,100 తీసుకొచ్చారు. ఇందులో సైక్లోన్ వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్‌ను సపోర్ట్ చేయటానికి, ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తుచేస్తూ, ఎక్కడా ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి ప్రభుత్వం అన్యాయం జరగకుండా, ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నమని చెప్పారు.







