
తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పోలకంపాడు, కొత్తూరు ఎస్టి కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలకంపాడు గ్రామం కొత్తూరు ఎస్టీ కాలనీ లోని రేకులు షెడ్డు ఇంటిలోపల పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI ద్వారా జిల్లా ఎస్పీ కి తెలియ పరిచి, SB CI శ్రీహరి సమక్షంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలసి రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా 11 సెల్ ఫోన్లు, 04 ద్విచక్ర వాహనాలు, రూ.69,200/- నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందులో ఆర్గనైజర్ పుట్టపర్తి.రాణి వైఫ్ ఆఫ్ :శివ 36, విజయవాడ.1. పులి.పీలిప్ 2. పాండురంగ పవన్3. సాతుపాటి కిరణ్4. చిన్నపోతుల అరుణ్ కుమార్5. సాతిపాటి జోసఫ్ కెనడి 6. సాతుపాటి చంద్రశేఖర్ 7. కోనేట వెంకటేశ్వర్లు 8. పేరం నాగమణి 9. మట్టపర్తి రాణి 10. ఇట్ట రమణ 11. బొజ్జ గాని భూలక్ష్మి







