Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur ggh lo:గుంటూరు జిజిహెచ్‌లో రూ.10 కోట్లతో ఆర్థో & ట్రామా బ్లాక్ నిర్మాణందాతల ముందడుగు – పెమ్మసాని చొరవతో ఎంఓయూ

గుంటూరు, నవంబర్ 1 :-గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్)లో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్థో & ట్రామా బ్లాక్ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో దాతలు ముందుకు వచ్చారు. డెక్కన్ టొబాకో కంపెనీ అధినేత షఫీక్ ఖాన్ గారు తన తండ్రి అజీజ్ ఉల్లా ఖాన్ గారి పేరున ఈ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.శనివారం స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గారితో కలిసి మంత్రి పెమ్మసాని గారు ఈ నిర్మాణానికి సంబంధించిన ఎంఓయూ చేసుకున్నారు.మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు:“గుంటూరు జిజిహెచ్‌లో నెలకు 350కి పైగా ఆర్థో సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ భవనాలు పాడై నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో దాతలు ముందుకు రావడం సంతోషకరం. షఫీ గారు కేవలం సహాయం మాత్రమే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా తీసుకోవడం గర్వించదగ్గ విషయం.“85 వార్డు బెడ్స్, 15 ఐసీయూ బెడ్స్, 2 ఆపరేషన్ థియేటర్లు, 5 వెయిటింగ్ జోన్స్, ఒక ఫిజికల్ థెరపీ రూమ్‌తో కూడిన ఈ బ్లాక్ పనులు నెలరోజుల్లో ప్రారంభమవుతాయి. రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో సుమారు రూ.82 కోట్ల విలువైన సౌకర్యాలను CSR నిధులు, ప్రభుత్వ నిధుల ద్వారా జిజిహెచ్‌కి అందించాం. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి కొనసాగుతుంది.”ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వ్యాఖ్యలు.

“పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ డా. పెమ్మసాని గారు జిజిహెచ్ అభివృద్ధికి CSR నిధుల ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారు. బొంగరాల బీడు అభివృద్ధి, MCH బ్లాక్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు ఆయన తోడ్పాటు అందించారు.

“మహిళా, శిశు ప్రసూతి బ్లాక్‌కు అవసరమైన ఎక్విప్మెంట్ మంజూరు చేయించడంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సతీష్ కుమార్ యాదవ్ గారి సహకారం ఉంది. జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.”పాల్గొన్నవారు:ఈ కార్యక్రమంలో దాతలు షఫీక్ ఖాన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. యశస్వి రమణ, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, జీడీఎంఎస్ చైర్మన్ వడ్రన్ హరిబాబు, జనసేన గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, కార్పొరేటర్ సమతా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button