ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

EID MUBARAK IN GUNTUR

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని, అల్లాహ్ దీవెనలతో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకోని నియోజకవర్గంలోని నగరంపాలెం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేసి, ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button