
శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం జరుగుతోందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులోని బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల ప్రాంతాల్లో పర్యటించారు. వాకర్స్, పట్టభద్రులను కలుసుకుని తన గెలుపుకు సహకరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టుబద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తన వాణిని వినిపిస్తామని స్పష్టం చేశారు.







