
గుంటూరు శ్రీనివాసరావుపేటలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి భూమిపూజ చేశారు. ఆలయాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో భక్తి భావం పెరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు, బిజెపి నాయకులు రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, టిడిపి, జనసేన నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.







