గుంటూరులో మతసామరస్యానికి ప్రతీకగా హజరత్ కాలే మస్తాన్ బాబా దర్గా నిలుస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం జిటి రోడ్డులో హజరత్ కాలే మస్తాన్ బాబా దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు దర్గా నిర్వాహకులు, ఫకీర్లు మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మత పెద్దలు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఎన్నో దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా ఈ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొని, బాబా ఆశిస్సులు తీసుకుంటున్నారని అన్నారు. ఈరోజు 133వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టం అని చెప్పారు. మస్తాన్ బాబా ఉరుసు జరిగే రోజులలో ప్రతి రోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావును, ఇతర నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు.
253 Less than a minute