chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha Local News :హలో రాకీ.. హౌ ఆర్ యూ-Ram Mohan Naiduతో కరచాలనం చేసుకున్న పోలీస్ జాగిలం ‘రాకీ’

విశాఖపట్నం, ఫిబ్రవరి 18:– విశాఖపట్నం విమానాశ్రయంలో ఈరోజు ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఉదయం నుంచి సుడిగాలి పర్యటనలు నిర్వహించిన కేంద్ర మంత్రి Ram Mohan Naidu, విశాఖలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీకి బయలుదేరే క్రమంలో విమానాశ్రయానికి చేరుకున్నారు.

Visakha Local News :హలో రాకీ.. హౌ ఆర్ యూ-Ram Mohan Naiduతో కరచాలనం చేసుకున్న పోలీస్ జాగిలం ‘రాకీ’

వి.ఐ.పి లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం ‘రాకీ’ ఆయన దృష్టిని ఆకర్షించింది. పెంపుడు, సాధు జంతువులపై అమితమైన ప్రేమ కలిగిన మంత్రి గారు వెంటనే రాకీ వద్దకు చేరుకుని మచ్చిక చేసుకుని కరచాలనం చేశారు. ఈ దృశ్యం అక్కడున్న అధికారులను, ప్రయాణికులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోని అనేక విమానాశ్రయాల్లో భద్రతా పరంగా పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విశ్వాసం, విధేయతకు ప్రతీకలైన ఈ జాగిలాలు భద్రతా వ్యవస్థలో ముఖ్య భాగమని వివరించారు. స్ఫోటక పదార్థాల గుర్తింపు నుంచి అనుమానాస్పద వస్తువుల తనిఖీ వరకు జాగిలాల సేవలు అపారమని తెలిపారు.

కాగా, జంతు ప్రేమికుడిగా పేరుగాంచిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన నివాసంలో గోశాల నిర్వహిస్తూ ఉండగా, శ్రీకాకుళం మరియు ఢిల్లీలోని ఇళ్లలో నాలుగు జాగిలాలను పెంచుతున్న విషయం తెలిసిందే.Visakhapatanam Local News :రోజ్‌గార్‌ మేళా ఘన విజయం

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్న ఈ అనుహ్యమైన, హృద్యమైన క్షణం అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది. 🐶

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker