chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Jaggayyapet lo 15: జగ్గయ్యపేటలో 15 కోట్లతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన

జగ్గయ్యపేట:నవంబర్ 11 :-జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సోమవారం భూమి పూజ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ,“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. జయంతిపురంలో ప్రారంభమవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, జగ్గయ్యపేట ప్రాంతాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతుంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, పెనుగంచిప్రోలు టిడిపి అధ్యక్షులు చింతల సీతారామయ్య, వత్సవాయి టిడిపి అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, కాసారం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, బండ్ల జాన్ ప్రకాష్, రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, గుండ్ల కృష్ణారావు, మాదినేని వెంకట్రావు, అనుమాల వేదాద్రి, మల్లెబోయిన జ్వాలా, పసుమర్తి మహేష్, ఇస్లావతు శ్రీను, సేటియా, బొడ్డు జయ, నంబూరి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker