
చీరాల: డిసెంబర్ 20:-సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల కు చెందిన బీటెక్ విద్యార్థిని ఓం లక్ష్మి జాతీయ స్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీల్లో మొదటి బహుమతి సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణ రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల గుంటూరులోని కల్లం హరనాధరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్టూడెంట్ టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ‘సంకల్ప్–2025’ లో భాగంగా నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీల్లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్న ఓం లక్ష్మి ఈ ఘనత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు తెలిపారు.
‘గ్రీన్ హౌస్’ అనే అంశంపై జరిగిన పీపీటీ పోటీల్లో ఆమె ప్రతిభావంతమైన ప్రజెంటేషన్ ప్రదర్శించి జాతీయ స్థాయిలో తొలి బహుమతి దక్కించుకున్నట్లు సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. టి. కిరణ్ కుమార్ పేర్కొన్నారు.Bapatla Local News
ఈ సందర్భంగా విద్యార్థినిని డా. సి. సుబ్బారావు (డైరెక్టర్, అక్రిడిటేషన్స్), ఆర్.వి. రమణమూర్తి (మేనేజర్–అడ్మినిస్ట్రేషన్), వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఘనంగా అభినందించారు.







