chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Narasaraopet Local News :కూటమిపాలనలో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది-పల్నాడు YSR CP అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

పల్నాడు జిల్లా:– కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంలా మారిందని పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

తిరుమల లడ్డు ప్రసాదం వివాదాన్ని డైవర్ట్ చేయడానికే తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని ప్రశ్నించారు.

లడ్డు ప్రసాదం వ్యవహారానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వస్తున్న సమయంలో అంబటి రాంబాబు పై వివిధ నియోజకవర్గాల నుంచి సమీకరించిన సుమారు 2000 మంది కార్యకర్తలతో కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయన ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా దాడులు చేశారని పేర్కొన్నారు.PALANADU – ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ వెంకట ప్రసాద్ కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన వైసిపి సీనియర్ నాయకులు నక్కా నాగిరెడ్డి..

ఈ ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారని, దాడులను అడ్డుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు పై జరిగిన దాడి పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker