chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

విశాఖపట్నం, ఫిబ్రవరి 19:– అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (International Fleet Review) మరియు వ్యాయామం MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer పాల్గొని ప్రసంగించారు. బంగాళాఖాతాన్ని నేపథ్యంగా చేసుకుని లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగిన ఈ వేడుక విశాఖ నగరానికి అపూర్వ గౌరవాన్ని తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

విశాఖపట్నం కేవలం ఆతిథ నగరం మాత్రమే కాదు, తూర్పు తీరానికి సముద్ర హృదయం అని గవర్నర్ అభివర్ణించారు. తరతరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సముద్రాన్ని అవకాశాల ద్వారంగా, ప్రపంచంతో అనుసంధానంగా చూసారని తెలిపారు. ఈ సందర్భంలో ప్రపంచ దేశాల స్నేహపూర్వక నౌకలు, భారత నౌకాదళ యుద్ధ నౌకలు కలిసి బంగాళాఖాతంలో నిలవడం అంతర్జాతీయ సముద్ర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

గత కొన్ని రోజులుగా విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షతో పాటు MILAN వ్యాయామం విజయవంతంగా నిర్వహించబడిందని, నిన్న భారత రాష్ట్రపతి సమీక్షించిన ఫ్లీట్ రివ్యూ సముద్రంపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిందని గవర్నర్ గుర్తుచేశారు. ఈరోజు సిటీ పరేడ్ ద్వారా ఆ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజలతో పంచుకునే ఉత్సవంగా మారిందన్నారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

భారత సైన్యాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ దళాల మార్చింగ్ కంటింజెంట్లు, సైనిక బ్యాండ్లు క్రమశిక్షణతో సాగిన పరేడ్ దేశ సైన్యాల ఐక్యతను ప్రతిబింబించిందన్నారు. విదేశీ దేశాల దళాలు, విమానాలు భారత భూమిపై అడుగుపెట్టడం స్నేహం, విశ్వాసం, పరస్పర గౌరవానికి నిదర్శపైన నిదర్శనమని చెప్పారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

ఎన్‌సీసీ, సీ కేడెట్ కార్ప్స్, పాఠశాల విద్యార్థుల పాల్గొనడం తనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని గవర్నర్ తెలిపారు. యూనిఫామ్‌లో కనిపించిన యువతలో క్రమశిక్షణ, లక్ష్యసాధన, ఆత్మవిశ్వాసం కనిపించిందని, వారు దేశ భవిష్యత్తు ప్రతినిధులని అభిప్రాయపడ్డారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, భారత సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన టాబ్లోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైనిక శక్తి మరియు సాంస్కృతిక సంపద కలయికే భారత బలం అని గవర్నర్ పేర్కొన్నారు.

రాత్రి వేళ సముద్రంలో నిలిచిన నౌకల దీపాలంకరణ, ఆకాశాన్ని కాంతుల వలయంగా మార్చిన బాణాసంచా, లేజర్ మరియు డ్రోన్ ప్రదర్శనలు విశాఖ ఆకాశాన్ని ప్రకాశింపజేశాయి. ఆధునిక భారత సృజనాత్మకతకు ఇవి ప్రతీకలని ఆయన చెప్పారు.

Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్‌ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer

విశాఖలో ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు గాఢమైన అనుబంధం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. విదేశీ నౌకల రాకతో విశాఖ అంతర్జాతీయ సముద్ర నగరంగా మరింత గుర్తింపు పొందుతుందని, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం అవుతాయని తెలిపారు.visakhapatanam Local News :ఆడిట్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి-(PUC) చైర్మన్ కూన రవికుమార్

ప్రపంచం పరస్పర అనుసంధానమవుతున్న ఈ కాలంలో సముద్రాలు దేశాలను కలుపుతున్నాయని, సముద్ర సహకారం శాంతి, సమృద్ధికి పునాది అవుతుందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ముగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker