Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

pedhala samajika:పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసాకు పింఛన్లు పంపిణీ – ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నవంబర్ 1:రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసాను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ ఆరు పంపుల బావి సెంటర్‌లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి, వారికి లభిస్తున్న పథకాల వివరాలు తెలుసుకున్నారు.ఎంపీ మాట్లాడుతూ, “విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడని కూటమి ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచి ఇస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది” అని తెలిపారు.ప్రతి నెల రూ.4 వేల నుండి రూ.15 వేల వరకు పింఛన్ రూపంలో ఆర్థిక సాయం లభిస్తోందని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వివరాలు చెప్పారు. “దీపం 2.0” కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, “తల్లికి వందనం” కింద విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల సాయం, “స్త్రీ శక్తి” కింద ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు “అన్నదాత సుఖీభవ” కింద రూ.20 వేల పెట్టుబడి సాయం, “ఆటోడ్రైవర్ల సేవలో” కింద ఆటో డ్రైవర్లకు రూ.15 వేల సాయం, రూ.5కే టిఫిన్, భోజనం అందించే “అన్న క్యాంటీన్లు” పునరుద్ధరణ వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, “విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి కృషి చేస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ ప్రెసిడెంట్ జాహీద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్. బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆషా, తెలుగు మహిళ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు సుఖాసి నరిత, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, బుద్ధా ఆలయ చైర్మన్ పిళ్లా సుదర్శన్, సీనియర్ నాయకులు కామా దేవరాజు, డివిజన్ అధ్యక్షులు అజీజ్, దుర్గారావు, గంగాధర్, బడుగు వెంకన్న, కుంచం దుర్గారావు, రాంబాబు, అమర మురళీ, బుదాల నందకుమారి, నాయకులు అన్సర్, నహీద్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు సుబ్బారెడ్డి, ధనేకుల సుబ్బారావు, సుభానీ, సుఖాసి కిరణ్తో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button