

- సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగర కొండ
బాపట్ల : నెల్లూరు జిల్లా వేదయపాలెం డి.ఆర్.డి.టి కాలనీకి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు ప్రజల్లో మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ నిరంతరం పోరాడిన కామ్రేడ్ పెంచలయ్యను,గంజాయి ముఠా గుండాలు కాపుగాసి చాలా దారుణంగా శుక్రవారం బైక్పై వెళుతుండగా కత్తులతో వెంటాడి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగర కొండ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తన్నీరు సింగర కొండ మాట్లాడుతూ స్కూళ్లు,కళాశాలలు,బస్టాండ్లు,వీధి వీధిలో పాటలతో ప్రజలను మేల్కొల్పాడనికి కామ్రేడ్ పెంచలయ్య కృషి చేస్తుంటే గంజాయి బ్యాచ్ పథకం ప్రకారం హత్య చేయడం హేయమైన చర్య అని అన్నారు. దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని,నేర ముఠాలకు రాజకీయ పరిరక్షణ కల్పించే వ్యవస్థను ప్రభుత్వం వెంటనే కూలదోయాలని,ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారికి జీవితఖైదు సహా అత్యంత కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.ఇది ప్రభుత్వ వైఫల్యానికి అత్యంత ప్రమాదకర సంకేతమన్నారు.దోషులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య కుటుంబ సభ్యులకు సింగర కొండ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.







