
కృష్ణా :గుడివాడ:17-10-25:- 17-10-25:-దేశంలో గత 43 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ వస్త్ర బ్రాండ్ “రామరాజు కాటన్” నూతన షోరూమ్‌ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐ.ఎం.ఏ అధ్యక్షులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ షోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ రాకేష్ మాట్లాడుతూ, “రామరాజు కాటన్ అనే పేరు ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా మారింది. నియోజకవర్గం సహా పక్క గ్రామాల ప్రజలందరికీ రామరాజు వస్త్రాలు సులభంగా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గుడివాడలో ఈ షోరూమ్‌ను ప్రారంభించాం” అని తెలిపారు.చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ అవసరమయ్యే అన్ని రకాల కాటన్ క్లాత్‌లు, డ్రెస్సు మెటీరియల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.
దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో ప్రత్యేక రాయితీలతో వస్త్రాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ షోరూమ్‌ను సందర్శించాలని రాకేష్ ఆకాంక్షించారు.







