మురికిపూడి గ్రామంలోని పాఠశాలను సందర్శించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు..
పల్నాడుజిల్లా చిలకలూరిపేట మండలం
చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలోని కందిమళ్ళ శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం రోటరీ క్లబ్ ప్రతినిధులు సందర్శించారు.ఇటీవల రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హ్యాండ్ వాష్ సింక్‌లు, రెండు మరుగు దొడ్లు నిర్మించారు.ఈ సందర్భంగా ఆయా పనులను క్లబ్ ప్రతినిధులు పరిశీలించారు.తొలుత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ డాక్టర్ శరత్ చౌదరి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవలు అభినందనీయం అన్నారు.వారు ఎంతో పట్టుదలతో సేవా కార్యామాలు చేస్తున్నారని కొనియాడారు.వారి సేవలు మరింత విస్తృతం అవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ప్రెసిడెంట్ ఆల్లవేమన్ రెడ్డి, సెక్రటరీ ఉప్పుటూరి ప్రసాదు, డైరెక్టర్స్ కాపు వెంకట్రావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, తోటకూర వెంకట్ నారాయణ, గళ్ళ సాంబశివరావు, హరిదాసుల శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.