Bapatla జిల్లా: 09-10-2025: యద్దనపూడి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి గణనీయమైన ముందడుగు పడింది. అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి కృషి ఫలితంగా రూ.10.32 కోట్ల నిధులతో మొత్తం 86 అభివృద్ధి పనులకు మంజూరు లభించింది. ఇవి రెండు విడతలుగా చేపట్టబడుతున్నాయి.
మొదటి విడతలో 24 వర్కులకు రూ.4.45 కోట్లు మంజూరై పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో విడతలో 62 వర్కులకు రూ.5.87 కోట్లు మంజూరయ్యాయి. వీటి పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.
గ్రామాల వారీగా నిధుల మంజూరు వివరాలు:
- అనంతవరం: రూ.1.55 కోట్లు – 9 వర్కులు (2 పూర్తయ్యాయి, 7 చేపట్టాల్సి ఉంది)
- యనమదల: రూ.86.30 లక్షలు – 6 వర్కులు (3 పూర్తయ్యాయి, 3 చేపట్టాల్సి ఉంది)
- వింజనంపాడు: రూ.50.50 లక్షలు – 5 వర్కులు (1 పూర్తైంది, 4 చేపట్టాల్సి ఉంది)
- పూనూరు: రూ.1.23 కోట్లు – 9 వర్కులు (2 పూర్తయ్యాయి, 7 చేపట్టాల్సి ఉంది)
- పోలూరు: రూ.92.50 లక్షలు – 8 వర్కులు (2 పూర్తయ్యాయి, 6 చేపట్టాల్సి ఉంది)
- యద్దనపూడి: రూ.88.50 లక్షలు – 7 వర్కులు (1 పూర్తైంది, 6 చేపట్టాల్సి ఉంది)
- శ్యామలవారి పాలెం: రూ.25 లక్షలు – 2 వర్కులు (1 పూర్తైంది, 1 చేపట్టాల్సి ఉంది)
- తనుబొద్దివారి పాలెం: రూ.30 లక్షలు – 4 వర్కులు (1 పూర్తైంది, 3 చేపట్టాల్సి ఉంది)
- చిమటవారిపాలెం: రూ.32.50 లక్షలు – 5 వర్కులు (2 పూర్తయ్యాయి, 3 చేపట్టాల్సి ఉంది)
- గన్నవరం: రూ.60 లక్షలు – 6 వర్కులు (2 పూర్తయ్యాయి, 4 చేపట్టాల్సి ఉంది)
- జాగర్లమూడి: రూ.1.81 కోట్లు – 13 వర్కులు (4 పూర్తయ్యాయి, 9 చేపట్టాల్సి ఉంది)
- సురవరపుపల్లి: రూ.46.50 లక్షలు – 6 వర్కులు (1 పూర్తైంది, 5 చేపట్టాల్సి ఉంది)
- మున్నంగివారి పాలెం: రూ.10 లక్షలు – 1 వర్క్ పూర్తయింది
- చింతగుంటపాలెం: రూ.10.30 లక్షలు – 2 వర్కులు (పనులు చేపట్టాల్సి ఉంది)
- చింతపల్లిపాడు: రూ.40.50 లక్షలు – 3 వర్కులు (1 పూర్తైంది, 2 చేపట్టాల్సి ఉంది)
ప్రజల్లో ఉత్సాహం, అభివృద్ధికి సాంబన్న పాలిట అంకితభావం
ఈ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రోడ్లకు సిమెంట్ రహదారులు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తీసుకున్న చర్యలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఆయన చొరవకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కృతజ్ఞతలతో ఆదరిస్తున్నారు.