
గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు నిర్మాణ పనులు ప్రారంభం అయినప్పటి జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈమేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ ప్రతినిధులు భారవి, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు బుధవారం
మీడియాతో మాట్లాడారు. గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణపై వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్ తోనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్వహించిన తర్వాతే ఆర్వోబీ నిర్మించాలని సూచించారు. రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. కానీ పాలకులు మాత్రం వచ్చే పదేళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు. శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో అధికారులు కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తామన్నారు.







