
గుంటూరు, నవంబర్ 5:-కార్తీక పౌర్ణమి సందర్భంగా గుంటూరు నగరం భక్తి మయమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్రరావుల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజా మహోత్సవం జ్యోతిర్మయి గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐదు వేల మందికి పైగా భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

జ్ఞానబ్రహ్మ శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు (శేకూరు) గురుస్వామి నేతృత్వంలో మహా పడిపూజా కార్యక్రమం ఘనంగా సాగింది. శ్రీ కుమార్ గురుస్వామి మరియు నరసరావుపేటకు చెందిన కుమారస్వామి అయ్యప్ప భజన బృందం అందించిన భజనలతో వేదిక ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగింది.భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తి భావంతో పూజల్లో పాల్గొన్నారు.

ఈ మహోత్సవానికి విశిష్ట అతిథులుగా నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, మహమ్మద్ నసీర్, టిటిడి బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పోతినేని శ్రీనివాస్, చిట్టాబత్తిన చిట్టిబాబు, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, ఏపీటియస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతి రావు, మన్నెం శివ నాగ మల్లేశ్వరావు, శిల్పకళా చైర్మన్ మంజుల, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ రావు, తాడిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు.భక్తుల ఉత్సాహం, వేదిక అలంకరణలు, భజన బృందాల ఆధ్యాత్మిక గానాలు గుంటూరు నగరాన్ని భక్తి మయంగా మార్చాయి.







