
గుంటూరు, అక్టోబర్ 11:స్త్రీ సాధికారతకు మహిళా కేంద్రిత కార్యక్రమాలతోపాటు సమాజపు దృక్పథం మారాల్సిన అవసరం ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. “స్త్రీకి నిజమైన సమానత్వం లభించాలంటే సమాజ ఆలోచన మారాలి,” అని ఆమె స్పష్టం చేశారు.Guntur Local News:సెలూన్, స్పా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్అశుతోష్ శ్రీవాస్తవ
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు గోరంట్లలోని భాష్యం సమతా మమతా క్యాంపస్‌లో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పార్క్ హర్ సమ్మిట్” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఆహ్వానంపై నిర్వహించారు.ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ —”ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి చర్చలు కేవలం మహిళల మధ్యే కాకుండా, పురుషులూ భాగస్వాములు కావాలి. ప్రేరణ మనలో ఆరంభ బీజం నాటుతుంది, కానీ గమ్యాన్ని చేరేందుకు క్రమశిక్షణ అవసరం. విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, కృషి — ఈ నాలుగు లక్షణాలుంటే ఏ అమ్మాయికైనా ఎదగడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు,” అని అన్నారు.మరింతగా, సోషల్ మీడియాలో ఆకర్షణలకు లోనవకుండా, యువత సానుకూల ఆలోచనలతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. “సోషల్ మీడియా మనకు సహాయకం కావాలి, కానీ మనపై ఆధిపత్యం చెలాయించకూడదు,” అని గల్లా మాధవి హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, డీసీపీ కె.జి.వి. సరిత, సిఎస్‌బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, భాష్యం పేరమ్మ, పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తదితరులు హాజరయ్యారు.







