St Ann’s engineering College:సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వర్క్ షాప్ …
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వర్క్ షాప్
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో డేటా అనలటిక్స్ యూజింగ్ పవర్ బిఐ అనే అంశంపై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు, మరియు కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ విభాగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రముఖ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఐబీఎం, మాస్టర్ ట్రైనర్ ఏలూరి నరేంద్ర ఈ వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పై అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ వర్క్ షాప్ ఏపీఎస్ఎస్డిసి, ఐబిఎం, ఎడ్యునెట్ ఫౌండేషన్ సంస్థల సహకారంతో కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ వర్క్ షాప్ నిర్వహించారన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ ఏలూరి నరేంద్ర మాట్లాడుతూ అప్లికేషన్స్ డిజైన్స్ చేసుకోవడానికి గ్రాఫికల్ ఫామ్ లో ఫలితాలను చూపించడానికి డేటా అనలిటిక్స్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతుందని, ఈ క్రమంలో మన సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుందని, పనులను సులభతరం చేస్తుందన్నారు. అలాగే మిషన్ లెర్నింగ్ తో యంత్రాలను స్మార్ట్ గా మారుస్తుందన్నారు. కార్యక్రమంలో సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ సి హరికిషన్, ఐ ఓ టి విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్. రమేష్, ఏపీ ఎస్ఎస్డిసి కోఆర్డినేటర్ ఎం ఉమామహేశ్వరరావు, ఏపీ ఎస్ ఎస్ డి సి స్పాక్ డాక్టర్ ఏ తిరుపతయ్య, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.