గుంటూరు
Guntur Chillies Commission Agents Association new executive committee:గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ
గుంటూరు: చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు అధ్యక్షులుగా డీ. నరేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రపంచంలోనే గుంటూరు మిర్చి యార్డ్ కి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. మిర్చి రైతుల సంక్షేమానికి నూతన కార్యవర్గం ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా చిల్లీస్ కమిషన్ ఏజెంట్ల సంక్షేమానికి నూతన పాలకవర్గం పనిచేస్తుందని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు